Dhankhar: రాహుల్ గాంధీపై ఉపరాష్ట్రపతి ధన్కర్ మండిపాటు
అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. తాజాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పరోక్షంగా రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజ్యాంగ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ''రాజ్యాంగం, జాతీయ ప్రయోజనాల గురించి ఆ వ్యక్తికి కనీసం అవగాహన కూడా లేదు.రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి శత్రువులతో కలవడం కన్నా ఘోరమైన విషయం ఇంకేమీ ఉండదు. దేశం వెలుపల ఉన్న ప్రతి భారతీయుడు దేశానికి రాయబారి కావాలి. కానీ, అతని ప్రవర్తన బాధాకరం. దేశ స్వాతంత్య్రం, రక్షణ కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు.ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయారు.
ఇది రాహుల్ అజ్ఞానం
మన జాతీయవాదాన్ని అపహాస్యం చేయలేము. 5,000 ఏళ్ల నాగరికత గల దేశంపై అతనికి తగిన గౌరవం లేదు'' అని ధన్కర్ అన్నారు. ''పవిత్రమైన రాజ్యాంగం మహనీయుల కృషి ఫలితం. కానీ, కొందరు దేశాన్ని విభజించాలనుకుంటున్నారు, ఇది వారి అజ్ఞానాన్ని తెలియజేస్తోంది'' అని వ్యాఖ్యానించారు. రాహుల్ తన అమెరికా పర్యటనలో వివిధ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రాహుల్, కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన అమిత్ షా
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాహుల్, కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ, దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, విచ్ఛిన్న శక్తులకు మద్దతు ఇవ్వడం వారి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుంటూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 50 శాతం మించి పెంచుతామని స్పష్టం చేశారు.ఇదే సందర్భంలో ధన్‌ఖడ్ రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.