LOADING...
Coaching Centre Tragedy : సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Coaching Centre Tragedy : సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2024
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లో ఓ కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు వచ్చి ముగ్గురు సివిల్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై కేంద్ర విద్యాశఆఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో మాట్లాడారు. ఈ ఘటనలో ముగ్గురు సివిల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

Details

అధికారుల్లో చలనం

అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, జవాబుదారీతనం నెలకొనేలా చూస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడం తమ బాధ్యతని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి, అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. మరోవైపు నీరు సాఫీగా వెళ్లేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.