
APPSC Group 1: ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాల కేసులో 'క్యామ్‌సైన్ మీడియా' సంస్థ డైరెక్టర్ అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల విషయంలో చోటు చేసుకున్న అక్రమాల కేసులో 'క్యామ్‌సైన్ మీడియా' సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో మధుపై కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో అతన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత మధును విజయవాడకు తరలించారు.
ఈ మూల్యాంకన కుంభకోణం కేసులో మధును పోలీసులు రెండో నిందితుడిగా (ఏ2) కోర్టులో హాజరుపరచనున్నారు.
వివరాలు
ఎఫ్‌ఐఆర్ విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదు
హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో నిర్వహించిన జవాబుపత్రాల మూల్యాంకన బాధ్యతలను నియమావళి ప్రకారం కాంట్రాక్ట్ లేదా టెండర్ ప్రక్రియ ద్వారా కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా 'కొటేషన్ విధానం' ద్వారా పొందినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే 'క్యామ్‌సైన్' సంస్థ మరికొన్ని విభాగాల్లోనూ అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యింది.
ఇందులో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయును ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చిన విషయం ఇదివరకే తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్యామ్‌సైన్ డైరెక్టర్ ధాత్రి మధు అరెస్టు
ఏపీ గ్రూప్-1 కేసులో కామ్ సైన్ డైరెక్టర్ మధుసూదన్(ధాత్రి మధు) అరెస్ట్ – మధుసూదన్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు – మధుసూదన్ ను విజయవాడకు తరలిస్తున్న పోలీసులు – ఏపీపీఎస్సీ నియామకాల్లో అక్రమాలను వెలికితీస్తున్న పోలీసులు
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) May 6, 2025