Page Loader
Guptha Nidhulu: విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు!
విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు!

Guptha Nidhulu: విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2023
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం (Visakhapatnam)లో లంకే బిందులు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. స్థానిక కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాటి చెట్లపాలెం రైల్వే క్వార్టర్స్‌లోని ఓ ఇంటి ఆవరణంలో తవ్వకాలు చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. గుప్త నిధుల కోసం రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 అడుగులు గొయ్యి తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల కోసం విజయవాడ నుంచి కొందరు వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Details

కేసు నమోదు చేసిన పోలీసులు

వీటి కోసం నెల రోజుల నుంచి పూజలు చేసినట్లు తెలిసింది. చుట్టూ పరదాలు కప్పి, రాత్రుళ్లు దేవుడు పాటలు పెట్టుకొని కోటేశ్వరరావు చుట్టూ పక్కల వాళ్లని ఏమర్చినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో గేట్లకు తాళాలు వేసుకొని మహిళలు పరారయ్యారు. దోష నివారణ కోసం పూజలు చేశామని, స్వామిజీ చెప్పినట్లు తానే చేశానని కోటేశ్వరరావు పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కోటేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.