Lok Sabha: లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై ప్రారంభమైన చర్చ .. కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైంది. అనంతరం, ఇప్పటికే నిర్ధేశించిన కార్యాచరణ ప్రకారం, ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కేవలం 22 నిమిషాల్లో విజయవంతంగా ముగించామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్ పౌరులు లేదా ఆర్మీకి ఎలాంటి హాని కలగకుండా.. కేవలం ఉగ్రవాదుల స్థావరాలు, ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు.
వివరాలు
పాక్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది: రాజ్‌నాథ్ సింగ్
ఇక ఈ దాడికి ప్రతిగా పాక్ ఆర్మీ చేసిన దూషణాత్మక చర్యలను భారత్ అన్ని విధాలుగా నిరోధించిందని తెలిపారు. పాక్ చర్యల వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. భారత సైన్యం చేసిన మెరుపుదాడులు పాకిస్థాన్ తట్టుకోలేకపోయిందని, చివరికి తమ ఉన్నతాధికారులతో కలిసి దాడులు నిలిపేయాలని కోరిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాక్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు.