LOADING...
Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ
వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ

Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2024
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. రెజ్లింగ్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లి వినేష్ ఫోగట్ పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు పడింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరిన వినేష్ ఫోగట్, 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా అనర్హత వేటు పడిన వినేష్ ఫోగట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారు.

Details

భారతీయులందరికీ వినేష్ ఫోగట్ స్ఫూర్తి

వినేష్ ఫోగట్ ఛాంపియన్లకే ఛాంపియన్లు అంటూ మోదీ కొనియాడారు. వినేష్ ఫోగట్ భారతీయులందరికీ స్ఫూర్తి అని, ఈ రోజు జరిగిన ఘటన చాలా బాధిస్తోందని పేర్కొన్నారు. తనకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నానని, అమె బలంగా పుంజుకోవాలన్నారు. సవాళ్లను ఎదుర్కొని, మళ్లీ గెలుపు దిశగా వెళ్లాలని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.