తదుపరి వార్తా కథనం
Diwali Holiday in Andhra Pradesh: దీపావళి సెలవు మారింది.. ఈసారి వరుసగా 3 రోజుల హాలీడేస్..!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 06, 2023
03:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగ సెలవులో మార్పు చేశారు.
ఈనెల 12 నుంచి 13వ తేదీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం నవంబర్ 12న (ఆదివారం) దీపావళి సెలవుగా ఉంది.
ఈ నేపథ్యంలో సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు.
నవంబర్ 13న ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రకటించారు.
Details
వరుసగా మూడు రోజులు స్కూల్ కు సెలవులు
దీపావళి సెలవు మార్పుతో పండగకి మూడు రోజులు సెలవులు రానున్నాయి.
నవంబర్ 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13 దీపావళి(సోమవారం) స్కూల్స్ కు సెలవులు రానున్నాయి.
ఇక స్కూల్స్ కు గత నెల 14 నుంచి 24 వరకు దసరా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే.