Karnataka Hicourt : డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు.. అక్రమాస్తుల కేసులోచుక్కెదురు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ ను సవాలు చేస్తూ డీకే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఇప్పటికే ఈ కేసులో చాలా వరకు కేసు విచారణ పూర్తయిందని పేర్కొంది. ఈ దశలో తమ జోక్యం సరైంది కాదని జస్టిస్ కె.నటరాజన్ తెలిపారు. మూడు నెలల్లోనే విచారణ ముగించి తుది నివేదికను సమర్పించాలని సీబీఐను ఆదేశించారు. దీంతో డీకేకు చుక్కెదురు అయ్యింది.
డీకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డీకే శివకుమార్ అక్టోబర్ 2, 2020న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాల్ చేశారు. ఫిబ్రవరి 2023లో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2013-2018 మధ్య కాలంలో డీకే శివకుమార్, సహా అతని కుటుంబ సభ్యులు రూ.74 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ అధికారులు అభియోగం మోపారు. అప్పటి నుంచి కర్ణాటక భారతీయ జనతా పార్టీ, డీకే శివకుమార్ పై విమర్శలు సంధిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.