
DK Shivakumar: అసెంబ్లీలో ఆర్.ఎస్.ఎస్. ప్రార్థనాగీతాన్ని పాడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర అసెంబ్లీలో అందరిని ఆశ్చర్యపరిచారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటపై చర్చ జరుగుతున్న సమయంలో, డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ ప్రార్థనలోని కొన్ని పంక్తులను పాడారు. కాంగ్రెస్ నాయకుడి నోటి నుంచి వచ్చిన ఈ పాటలను విన్న అసెంబ్లీ లోపల ఉన్న నాయకులందరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాధినేతల నోటి నుంచి ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతం రావడం ఏంటని విస్తుపోయారు.
వివరాలు
ఆర్సీబీ జట్టును కేవలం ప్రొత్సహించడానికే వెళ్లా:శివకుమార్
ఐపీఎల్ లో ఆర్‌సీబీ విజయం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన వేడుకలల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటనకు శివకుమార్ బాధ్యత వహించాలని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. బెంగళూరు ఇన్‌ఛార్జ్ మంత్రిగా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఆయన ఆర్సీబీ జట్టును కేవలం ప్రోత్సహించడానికి మాత్రమే స్టేడియం వెళ్లారని తెలిపారు. ఆటగాళ్లను అభినందించి, కప్‌ను ముద్దాడాక , అక్కడితోనే తన పని ముగిసిందని ఆయన వివరించారు. అంతేకాకుండా, ఈ విధమైన దుర్ఘటనలు ఇతర రాష్ట్రాల్లోనూ జరిగాయని, కావాలంటే డీకే వాటిని వివరిస్తానని పేర్కొన్నారు.
వివరాలు
గతంలో డీకే శివకుమార్ ఆరెస్సెస్ యూనిఫాం
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక్, గతంలో డీకే శివకుమార్ ఆరెస్సెస్ యూనిఫాం ధరించారని చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. దీనిపై ప్రతిస్పందిస్తూ డీకే శివకుమార్ "నమస్తే సదా వత్సలే మాతృభూమే... త్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం..." అనే ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతాన్ని ఆసంబ్లీలో పాడారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. అసెంబ్లీలో ఉన్న మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సరిగ్గా రియాక్ట్ కాలేదు. మౌనంగా ఉండిపోయారు.
వివరాలు
అగ్రనాయకులు సైతం ఆర్ఎస్ఎస్‌ను విమర్శించారు
ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీకి ఆర్ఎస్ఎస్ పై పెద్దగా సానుకూల భావం ఉండదు. అగ్రనాయకులు సైతం ఆర్ఎస్ఎస్‌ను విమర్శిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిశలో ఈ సంఘాన్ని అనేకసార్లు భారత్‌లో నిషేధించింది, ప్రార్థనలు చేయనివ్వలేదు. ఇటీవలే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంలో,పంద్రాగస్ట్ ఎర్రకోట వేదికగా మోడీ కొనియాడారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
DK Shivakumar singing the RSS anthem in the House.
— Meme Farmer (@craziestlazy) August 22, 2025
Maybe that’s his way of telling Siddaramaiah to vacate the chair before it’s too late.
Karnataka government looks on shaky ground 😂 pic.twitter.com/yAACBqMSao