
Pashamylaram: గుర్తించలేని స్థితిలో మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్షలకు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాశమైలారంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ విషాదకర ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాద తీవ్రతను బట్టి పలువురి మృతదేహాలు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో,వాటిని గుర్తించటం అసాధ్యంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మృతులును గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
ప్రమాద స్థలానికి రేవంత్ రెడ్డి
ఇంకా శిథిలాల కింద ఇంకా సుమారు 27 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వారి కోసం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. ఆయన సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఉదయం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ కలిసి ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.