Page Loader
Delhi Doctor Murder: ఢిల్లీలో డాక్టర్​ దారుణ హత్య ...ఇంటిలో బీభత్సం సృష్టించిన దొంగలు

Delhi Doctor Murder: ఢిల్లీలో డాక్టర్​ దారుణ హత్య ...ఇంటిలో బీభత్సం సృష్టించిన దొంగలు

వ్రాసిన వారు Stalin
May 11, 2024
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేసేందుకు వెళ్లిన దొంగలు డాక్టర్​ ను దారుణంగా హతమార్చారు. శుక్రవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని జంగుపుర ఏరియాలో డాక్టర్ యోగేష్ చంద్రపాల్ అనే వ్యక్తి జనరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్నారు. ఈయన ఇంటికి దొంగతనానికి వెళ్లిన దొంగలు గొంతు కోసి హతమార్చారు చేతులు కట్టి కిచెన్ లో పడేశారు . అనంతరం ఇంట్లో దొరికిన డబ్బు నగలు దోచుకున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ఇంటిలో మృతదేహం ఉంది అని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు.

Delhi Murder

కుక్కను గదిలో బంధించి..

పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా కాళ్లు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు కనుగొన్నారు. డాక్టర్​ యోగేష్ పెంపుడు కుక్కను దోపిడీ దొంగలు వేరే గదిలో బంధించివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చంద్రపాల్​ కు భార్య నీనా ఉన్నారు. నీనా కూడా ఢిల్లీ గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు.