
Nadendla Manohar: దుష్ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వొద్దు.. పార్టీ నాయకులకు నాదెండ్ల సూచన
ఈ వార్తాకథనం ఏంటి
సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ లేదా కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాలను పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, ఈ విషయాన్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇటీవల ప్రమాదాల్లో మృతిచెందిన 22 మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
Details
ప్రజల కోసం పనిచేస్తేనే పదవులు
ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే పదవులు స్వయంగా వస్తాయని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై పార్టీ నాయకులు దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు.
జనసేన నాయకులు, కార్యకర్తలు ద్రుష్పచారాన్ని నమ్మకూడదని ఆయన సూచించారు.