
Bihar: 'బ్రాహ్మణలంటే నాకు ఇష్టం లేదు': వ్యక్తిని కొట్టి.. బలవంతంగా ఉమ్ము నాకించిన పోలీస్ అధికారి
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్రం షేక్‌పురా జిల్లాలో ఓ పోలీస్ అధికారి క్రూరంగా ప్రవర్తించిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. జూలై 1వ తేదీన మెహుస్ గ్రామంలో ప్రయాణికులను దించి వెళ్తున్న ఎలక్ట్రిక్ఆటో నడిపే ప్రదుమాన్ కుమార్ అనే వ్యక్తిని,సివిల్ డ్రెస్‌లో బైక్‌పై వచ్చిన మెహుస్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ చంద్ర దివాకర్ అడ్డుకుని తిట్టాడు. వాగ్వాదం నేపథ్యంలో సుమారు 50సార్లు లాఠీతో అతడ్ని కొట్టాడు. అంతటితో ఆగకుండా,ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని,మహిళలను వేధించాడని ఆరోపణలు చేస్తూ అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా శారీరకదాడికి పాల్పడ్డాడు.అనంతరం అతని కులం గురించి అడిగాడు. ప్రదుమాన్ తాను బ్రాహ్మణుడినని చెప్పిన తర్వాత,"బ్రాహ్మణుల్ని చూడటం నాకు ఇష్టం ఉండదు" అంటూ ఆపోలీస్ అధికారి వ్యాఖ్యానించాడు.
వివరాలు
ప్రవీణ్ చంద్ర దివాకర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ
నేలపై ఉమ్మి వేసి, ప్రదుమాన్‌ను బలవంతంగా దానిని నాకించాడని సమాచారం. ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక ప్రదుమాన్ కుమార్ తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్‌కు బాధితుడు ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యేతో పాటు ప్రాంతీయ ప్రజలు పోలీస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తీవ్ర స్థాయిలో చర్చకు దారితీయడంతో జిల్లా ఎస్పీ చర్యలకు పూనుకున్నాడు. కేసు విచారణకు ఆదేశిస్తూ,పోలీస్ అధికారి ప్రవీణ్ చంద్ర దివాకర్‌ను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని దివాకర్ పేర్కొన్నారు.