
Donald Trump: ఫార్మా రంగంపై ట్రంప్ దృష్టి.. భారతదేశంపై దాని ప్రభావం ఎంత?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటివరకు ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చిన ఫార్మా రంగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ,త్వరలోనే టారిఫ్‌లు (సుంకాలు) విధించనున్నట్టు ప్రకటించారు.
ఇటీవల జరిగిన రిపబ్లికన్ పార్టీ డిన్నర్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''ఫార్మారంగానికి కూడా సుంకాలు తప్పవు.ఎందుకంటే అమెరికాలో ఔషధాల ఉత్పత్తి తక్కువగా ఉంది.వాటిని ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం టారిఫ్‌లు విధిస్తే కంపెనీలు అమెరికాలోనే తమ కర్మాగారాలను ఏర్పాటు చేయడంలో ఆసక్తి చూపుతాయి.ఎందుకంటే అమెరికా మార్కెట్ విస్తృతమైనది.ఫార్మా రంగంపై త్వరలో ప్రధాన టారిఫ్‌ను ప్రకటిస్తాను.దాంతో కంపెనీలు చైనా సహా ఇతర దేశాలను వదిలి,ఇక్కడే ఉత్పత్తికి మొగ్గు చూపుతాయి.ఎందుకంటే తమ ఉత్పత్తుల పెద్ద మార్కెట్ ఇదే''అని ట్రంప్ స్పష్టం చేశారు.
వివరాలు
భారతీయ ఫార్మా రంగంపై ప్రభావం
భారతదేశంలోని ఫార్మా కంపెనీలు పెద్ద సంఖ్యలో జనరిక్ ఔషధాలను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే.
అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఈ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మన దేశం నుంచి తయారయ్యే జనరిక్ ఔషధాల్లో సుమారు 40 రకాలవి నేరుగా అమెరికాకు వెళ్లుతున్నాయి.
2024 సంవత్సరంలో ఈ రంగం ద్వారా దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు భారతీయ ఫార్మా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
తక్కువ ధరకే లభించే మన జనరిక్ ఔషధాలను అక్కడి ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో, టారిఫ్‌ల వలన వాటి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
తయారీదారులకు సవాళ్లు
ఇది అక్కడి ఆరోగ్య రంగాన్ని నెమ్మదిగా ద్రవ్యోల్బణ దిశగా నడిపించవచ్చు.
ఇప్పటికే జనరిక్ ఔషధాల తయారీలో లాభాలు స్వల్పంగా ఉంటున్నాయి.
దీనిపై టారిఫ్‌ల భారం కూడా చేరితే, భారతీయ తయారీదారులకు తీవ్ర ఆర్థిక బాద్యతలు ఎదురవుతాయి.
ఫలితంగా, కొందరు ఉత్పత్తిని తగ్గించవచ్చు, లేదా ఉత్పత్తి పూర్తిగా నిలిపేసే అవకాశమూ ఉంది.
దీని వలన ఔషధాల కొరత, లాభదాయకత లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
చైనా పరిస్థితి మరింత క్లిష్టం
ఔషధ ఉత్పత్తిలో చైనా కూడా ప్రముఖ దేశంగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆ దేశంపై ట్రంప్ 104 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఫార్మా రంగానికి కూడా సుంకాలు అమలవుతే, చైనా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. డ్రాగన్ దేశం ఔషధ రంగంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి మించిపోతుంది.