Nitish Kumar-Lalu Prasad Yadav: ''నీతీశ్‌కుమార్‌కు మా తలుపులు తెరిచే ఉన్నాయి".. నితీష్ కి లాలూ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్'కు (Nitish Kumar) ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఓ ఆఫర్ ఇచ్చారు.
ఆ ఆఫర్‌కు నీతీశ్ తన ప్రత్యేకమైన శైలిలో సమాధానం ఇచ్చారు. అసలు ఏమైందంటే...
లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ''నీతీశ్ కుమార్‌కు మా తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఆయన కూడా తన గేట్లు తెరిస్తే, రెండు వైపుల రాకపోకలు సులభతరం అవుతాయి'' అని వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై మీడియా నీతీశ్‌ను ప్రశ్నించగా, ఆయన రెండు చేతులు జోడించి దండం పెట్టారు.
పైగా,ఏంటి అన్నట్టుగా ఓ చిరునవ్వు నవ్వారు.
వివరాలు
లాలూ యాదవ్ కలలు ఎప్పటికీ కలల్లాగే మిగిలిపోతాయి
మిత్రపక్షాలను మార్చుకుంటూ బిహార్‌లో చాలా కాలంగా అధికారంలో కొనసాగుతున్న నీతీశ్ కుమార్, ఇటీవల జాతీయ స్థాయిలో బీజేపీకు వ్యతిరేకంగా 'ఇండియా' కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు.
పట్నాలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కీలకంగా వ్యవహరించారు.అయితే,'ఇండియా' కూటమిలో ఉన్నత పదవుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఆయన తిరిగి ఎన్డీయేలో చేరి,గత సంవత్సరం తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
లాలూ ప్రసాద్ వ్యాఖ్యల తర్వాత,నీతీశ్ మళ్లీ కూటమి మారతారా? అనే చర్చలు మళ్లీ చురుగ్గా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) ఈ వ్యాఖ్యలపై స్పందించారు.
''లాలూ యాదవ్ కలలు ఎప్పటికీ కలల్లాగే మిగిలిపోతాయి. అవి అసలు నెరవేరవు'' అని ఆయన స్పష్టంగా చెప్పారు.