
Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్ డెక్కర్ బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో డబుల్‌డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
స్టీల్‌ప్లాంట్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఒక బస్సును అందించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా,మిగిలిన రెండు బస్సులను గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) స్వయంగా కొనుగోలు చేయనుంది.
బస్సుల కొనుగోలుకు సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) పేరుతో టెండర్లు ఇప్పటికే జీవీఎంసీ ఆహ్వానించింది.
నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన సింహాచలం,కైలాసగిరి,తొట్లకొండ తదితర ప్రాంతాల్లో ఈ బస్సులను నడిపే ప్రణాళికలు అధికారులు సిద్ధం చేస్తున్నారు.
వచ్చే నెల 10వ తేదీలోపు కనీసం ఒక బస్సును అందుబాటులోకి తెచ్చి, ఆ బస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని,ఇంఛార్జి కమిషనర్ హరేంధిరప్రసాద్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.