Page Loader
Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం 
రాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన; యువతి బైక్‌పై ఉండగా హస్త ప్రయోగం

Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం 

వ్రాసిన వారు Stalin
Jul 23, 2023
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో యువతి పట్ల ఓ రాపిడో డ్రైవర్‌ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఆ డ్రైవర్ హస్త ప్రయోగం చేసినట్లు, అలాగే తనను డ్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించనట్లు అతిర అనే యువతి ఆరోపించారు. రాపిడో సంస్థ బైక్ ట్యాక్సీ సేవల పేరుతో తనపై జరిగిన వేధింపులను ఆ యువతి ట్విట్టర్ ద్వారా శుక్రవారం పంచుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు శనివారం ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మణిపూర్‌లో గిరిజన మహిళలపై జరిగిన అమానుష ఘటన నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు చేపట్టిన నిరసనలో పాల్గొన్న అతిర తన ఇంటికి వెళ్లేందుకు రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు.

బెంగళూరు

డ్రాప్ చేసిన తర్వాత వాట్సాప్ కాల్స్, అసభ్యకర మెసేజ్‌లు

ఆ డ్రైవర్ రాపిడో మొబైల్ అప్లికేషన్‌లో రిజిస్టర్ చేసుకున్న బైక్‌కు బదులుగా, వేరే బైక్‌ను తీసుకొచ్చాడని అతిర ట్వీట్‌లో పేర్కొన్నారు. తాము బైక్‌పై వెళ్తున్న క్రమంలో ఎవరూ లేని ప్రాంతానికి చేరుకున్నామని, అక్కడ డ్రైవర్ ఒక చేత్తో బైక్ నడుపుతూ, మరో చేత్తో హస్తప్రయోగం చేయడం మొదలు పెట్టినట్లు ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చింది. అ సమయంలో తనకు భయం అనిపించి మౌనంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తనను డ్రాప్ చేసిన తర్వాత డ్రైవర్ తనకు మెసేజ్‌లు చేయడం మొదలు పెట్టినట్లు అతిర చెప్పారు. తనకు వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ వేధించినట్లు పేర్కొంది. చివరికి అతని నంబర్‌ను తాను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఆ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌తీసి బాధితురాలు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అతిర చేసిన ట్వీట్