Page Loader
UP: ఉత్తర్‌ప్రదేశ్‌ లో దారుణం.. టీచర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్ 
ఉత్తర్‌ప్రదేశ్‌ లో దారుణం.. టీచర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్

UP: ఉత్తర్‌ప్రదేశ్‌ లో దారుణం.. టీచర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 19, 2024
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. విధుల్లో ఉన్న ధర్మేంద్ర కుమార్ అనే ఉపాధ్యాయున్ని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చంద్రప్రకాష్ (50) కాల్చి చంపాడు. వారణాసి నుండి యూపీ బోర్డు పరీక్ష కాపీలను స్థానిక ఇంటర్ కళాశాలకు తీసుకువచ్చే క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన కానిస్టేబుల్ సదరు టీచర్ పై కాల్పులు జరిపాడు. నిందితుడు చంద్రప్రకాష్ ని అరెస్టు చేశారు. ఘటన అనంతరం వందలాది మంది ఉపాధ్యాయులు బాధితుడు కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉపాధ్యాయున్ని కాల్చి చంపిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్