
Kumaraswamy: కుమారస్వామి ఇంటికి దొంగ కరెంట్.. కర్ణాటక మాజీ సీఎంపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసు ఎందుకు నమోదు అయ్యిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కుమారస్వామి తన ఇంటికి దొంగ కరెంట్ తీగలను వేసుకోవడంతో విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దీపావళి సందర్భంగా కుమారస్వామి బెంగళూరు పి. నగర్‌లోని తన నివాసానికి లైటింగ్ కోసం అనుమతులు తీసుకోకుండా అక్రమంగా తీగలను స్తంభానికి తగిలించినట్లు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అభియోగాలు మోపింది.
దీంతో బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ (బెస్కామ్) విజిలెన్స్ సెల్.. విజిలెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ (విద్యుత్ దొంగతనం) సెక్షన్ 135 కింద ఈ కేసును నమోదు చేసింది.
బెంగళూరు
కుమారస్వామి వివరణ.. కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
ఈ వివాదంపై కుమారస్వామి స్పందించారు. ఇది తన తప్పు కాదన్నారు. ప్రైవేట్ డెకరేటర్ తనకు తెలియకుండా చేసిన తప్పిదం అన్నారు.
ఈ విషయం తనకు తెలియగానే వెంటనే దాన్ని తొలగించి ఇంటి మీటర్ బోర్డు నుంచి కరెంటు కనెక్షన్ ఇప్పించామని కుమారస్వామి పేర్కొన్నారు.
కరెంట్ చోరీ అంశంపై కుమారస్వామిని విమర్శిస్తూ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్( ఎక్స్) వేదికగా స్పందించింది.
ప్రపంచంలో ఉన్న ఏకైక నిజాయితీపరుడు హెచ్‌డి కుమారస్వామి అని వ్యంగ్యంగా స్పందించింది. అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో ఆయన ఇల్లు వెలిగిపోయిందని వెల్లడించింది.
ఒక మాజీ ముఖ్యమంత్రి కరెంటు దొంగతనం చేసేంత పేదరికాన్ని ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని దుయ్యబట్టింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ ట్వీట్
ಜಗತ್ತಿನ ಏಕೈಕ ಮಹಾಪ್ರಾಮಾಣಿಕ ಹೆಚ್.ಡಿ ಕುಮಾರಸ್ವಾಮಿಯವರ ಜೆ ಪಿ ನಗರದ ನಿವಾಸದ ದೀಪಾವಳಿಯ ದೀಪಾಲಂಕಾರಕ್ಕೆ ನೇರವಾಗಿ ವಿದ್ಯುತ್ ಕಂಬದಿಂದ ಅಕ್ರಮ ವಿದ್ಯುತ್ ಸಂಪರ್ಕ ಪಡೆದಿದ್ದಾರೆ.
— Karnataka Congress (@INCKarnataka) November 14, 2023
ಒಬ್ಬ ಮಾಜಿ ಸಿಎಂ ಆಗಿ ವಿದ್ಯುತ್ ಕಳ್ಳತನ ಮಾಡುವ ದಾರಿದ್ರ್ಯ ಬಂದಿದ್ದು ದುರಂತ!@hd_kumaraswamy ಅವರೇ ನಮ್ಮ ಸರ್ಕಾರ ಗೃಹಜ್ಯೋತಿಯಲ್ಲಿ 200 ಯೂನಿಟ್… pic.twitter.com/7GKHeRyQuS