Earthquake: దిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు
దిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఈ భూకంపంతో దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూమి కంపించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌కు 9 కిలోమీటర్ల దూరంలో, ఉపరితలానికి 10కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉంది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన దిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు బలమైన ప్రకంపనలను వచ్చాయి. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు భూకంపం వచ్చింది. దేశంలో ఇటీవల సంభవించిన భూకంపాల్లో ఇది అత్యంత బలమైనది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఆదివారం హెరాత్‌కు 34కిలోమీటర్ల దూరంలో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.