LOADING...
Earthquake: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత
భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత

Earthquake: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-మయన్మార్ సరిహద్దులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఏర్పడిందని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. భూకంపం కారణంగా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా పాకిస్థాన్, నేపాల్, ఉత్తర భారతదేశంలో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Details

భూమి కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భయంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.