
Delhi Earthquake: డిల్లీలో మరోసారి భూకంపం.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీమరోసారి భూకంపం ధాటికి వణికిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ఇదిలా ఉంటే, గురువారం రోజు కూడా ఢిల్లీ భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైంది. హర్యానాలోని ఝాజ్జర్ పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో,భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప తీవ్రత 4.4గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ సెంటర్ అధికారికంగా ప్రకటించింది.
వివరాలు
ప్రాణభయంతో భవనాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు
ఢిల్లీ-ఎన్‌సీఆర్ మాత్రమే కాకుండా, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో కూడా భూమి కంపించినట్లు సమాచారం. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. గురువారం ఉదయం 9 గంటల 4 నిమిషాలకు ఈ ప్రకంపనలు కొన్ని సెకన్లపాటు కొనసాగాయి. దీంతో ఢిల్లీలోని కొంతమంది నివాసితులు భయంతో తక్షణమే భవనాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.