RG Kar Rape case: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రహస్య స్థావరంపై ED దాడులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారం కేసు దర్యాప్తులోకి ప్రవేశించింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ నివాసంపై ఈడి బృందం దాడులు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున కోల్‌కతాలోని డాక్టర్ సందీప్ ఘోష్‌తో పాటు మరికొంతమంది నివాసాలపై ఈడీ బృందం దాడులు చేసింది. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి పిఎంఎల్‌ఎ కింద ఈడి కేసు నమోదు చేసింది. సందీప్ ఘోష్ ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కస్టడీలో ఉన్నారు.