NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Qatar-India: ఖతార్ జైలు నుండి 8మంది భారతీయ నావికాదళ సభ్యుల విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Qatar-India: ఖతార్ జైలు నుండి 8మంది భారతీయ నావికాదళ సభ్యుల విడుదల 
    ఖతార్ జైలు నుండి 8మంది భారతీయ నావికాదళ సభ్యుల విడుదల

    Qatar-India: ఖతార్ జైలు నుండి 8మంది భారతీయ నావికాదళ సభ్యుల విడుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2024
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది.

    విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ పరిణామాన్ని స్వాగతించింది.

    అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ అనే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిలో ఏడుగురు ఖతార్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారని తెలిపారు.

    "ఖతార్‌లో నిర్బంధించబడిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఖతార్ రాష్ట్ర ఎమిర్ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము. " అని MEA ఒక ప్రకటనలో తెలిపింది.

    Details 

    ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన నేవీ అధికారులు

    గత ఏడాది డిసెంబర్‌లో అల్ దహ్రా గ్లోబల్ కేసులో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ అధికారులకు మరణశిక్షను ఖతార్ కోర్టు రద్దు చేసింది.

    మరణశిక్షను జైలు శిక్షగా మార్చగా..తాజాగా దాని నుంచి విముక్తి కల్పించింది నేవీ అధికారులకు విధించిన మరణశిక్షకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

    ఖతార్‌లో అదుపులోకి తీసుకున్నఎనిమిది మంది భారత నేవీ అధికారులు..కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ,కెప్టెన్ సౌరభ్ వశిష్ట్,కమాండర్ అమిత్ నాగ్‌పాల్,కమాండర్ పూర్ణేందు తివారీ,కమాండర్ సుగుణాకర్ పాకాల,కమాండర్ సంజీవ్ గుప్తా,సెయిలర్ రగేష్.

    భారత నేవీ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఖతార్
    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఖతార్

    8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు  అంతర్జాతీయం
    Jaishankar: అందరినీ విడిపిస్తాం: ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధిత కుటుంబాలతో జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్ భారతదేశం
    Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి హమాస్

    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ మాల్దీవులు
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025