Page Loader
Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు

Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Stalin
Dec 11, 2023
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రధాన లక్షణాలలో ఒకటని, వాటిని నిలిపివేయలేమని ధర్మాసనం పేర్కొంది.

ఎన్నికలు

వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరణ: ధర్మాసనం 

సెప్టెంబర్ 30, 2024 నాటికి జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. 2014లో జమ్ముకశ్మీర్‌లో చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో బీజేపీ కూటమి నుంచి వైదొలగడంతో అసెంబ్లీ రద్దయింది. దీంతో గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. ఆగస్టు 5, 2019న, కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ క్రమంలో గతంలో ఉన్న రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. ఇప్పుడు జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం