Page Loader
వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు
వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

వ్రాసిన వారు Stalin
Mar 08, 2023
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బిల్లుపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. రాష్ట్రాలు, పంపిణీదారుల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకున్న కమిటీ నివేదికను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. , విద్యుత్ సవరణ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ 2022 ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీంతో ఈ బిల్లును నవంబర్ 21, 2022న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ప్యానెల్‌ను ఆదేశించారు.

విద్యుత్

విద్యుత్ సవరణ బిల్లు- 2022 అంటే?

విద్యుత్ రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ఈ సవరణ బిల్లును కేంద్రం రూపొందించింది. విద్యుత్ రంగంలో పోటీ పెంచడం, నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు పునరుత్పాద ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. విద్యుత్ సవరణ బిల్లు- 2022 బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ పంపిణీ వ్యాపారానికి లైసెన్స్ అవసరం ఉండదు. అలాగే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌కి బదులుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనే కాన్సప్ట్‌ను తీసుకొస్తారు. ఈఆర్సీ వద్ద నమోదు చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా మారొచ్చు. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ ప్రాంత పరిధిలో ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చు. ఆర్పీపీఓ కింద విద్యుత్ సంస్థలు తప్పుకుండా కనీసం కొంత మొత్తమైనా పునరుత్పాదక విద్యుత్‌ను కచ్చితంగా కొనుగోలు చేయాలి.