LOADING...
Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం
బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం

Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ నేషనల్ పార్క్ పరిధిలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. రాత్రి నేషనల్ పార్క్ సమీపంలో మళ్లీ జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. ఈ ఘర్షణలు నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. ముందుగా నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేతలు సుధాకర్, భాస్కర్ మృతిచెందారని తెలుస్తోంది. భద్రతా బలగాలు వారి చేతిలో ఉన్న ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

Details

ఇద్దరు టాప్ కమాండర్లతో సహా మొత్తం నలుగురు మృతి

మూడు రోజులుగా నక్సలైట్లపై నేషనల్ పార్క్‌లో విస్తృత ఆపరేషన్లు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో జరిగిన ఈ చర్యల్లో కోటి రివార్డుతో గుర్తింపు పొందిన నక్సలైట్ సుధాకర్, రూ. 25 లక్షల రివార్డుతో ఉన్న భాస్కర్ మృతిచెందారని అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటివరకు ఈ ఆపరేషన్‌లో ఇద్దరు టాప్ కమాండర్లతో సహా మొత్తం నలుగురు నక్సలైట్లు చనిపోయారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని అధికార వర్గాలు తెలిపారు.