Page Loader
UP Encounter: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌
మీరట్‌లో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌

UP Encounter: మీరట్‌లో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 26, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు. పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. మృతుడిని జీతుగా గుర్తించారు. అతనిపై రూ. 1 లక్ష రివార్డు ఉంది. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) తో జరిగిన ఘర్షణలో అతను మరణించాడు. జీతు అలియాస్ జితేంద్ర ఎదురుకాల్పుల కారణంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మీరట్‌లోని ముండలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్, నేరస్తుల ముఠా మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన జీతు అనేక నేరాలకు పాల్పడ్డాడు. అతనిపై ఇప్పటికే ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Details

మర్డర్ కేసులో జీవిత ఖైదు

2018 ఫిబ్రవరి 3న ఝజ్జర్ డబుల్ మర్డర్ కేసులో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. మరో కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను కూడా అనుభవిస్తున్నాడు. 2023లో పెరోల్‌పై విడుదలైన అతను తిరిగి పరారయ్యాడు. పరారీలో ఉన్న జీతు ఘజియాబాద్ తిలామోడ్ ప్రాంతంలో మరో హత్యను జరిపాడు. జైలులో ఉండగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు పెంచుకున్నాడు. తప్పించుకున్న అతనిపై పోలీసులు రూ. 1 లక్ష రివార్డు ప్రకటించారు. దిల్లీ, ఝజ్జర్, కంజావాలా, వికాస్ పురి, యూపీలోని ఘజియాబాద్‌లో పలు నేరాల్లో అతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.