Page Loader
Vikram Misri: చమురు కొనుగోళ్లకు ఇంధన భద్రత ప్రధాన అంశం,ద్వంద్వ ప్రమాణాలు లేవు: విదేశాంగ కార్యదర్శి
చమురు కొనుగోళ్లకు ఇంధన భద్రత ప్రధాన అంశం,ద్వంద్వ ప్రమాణాలు లేవు: విదేశాంగ కార్యదర్శి

Vikram Misri: చమురు కొనుగోళ్లకు ఇంధన భద్రత ప్రధాన అంశం,ద్వంద్వ ప్రమాణాలు లేవు: విదేశాంగ కార్యదర్శి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరోపియన్ యూనియన్(ఈయూ)ఆంక్షలు,పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ,రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. భారత్‌కు ఇంధన భద్రత అత్యంత ప్రాధాన్యమని,ప్రజలకు అవసరమైన ఇంధనాన్ని అందించడమే ప్రధాన లక్ష్యమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ప్రపంచ ఇంధన మార్కెట్లో ద్వంద్వప్రమాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో,ప్రపంచ ఇంధన మార్కెట్లో ద్వంద్వ ప్రమాణాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు.మాకు ఏది అవసరమో అది చేస్తాం అని మిస్రీ స్పష్టం చేశారు. రష్యా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుని,దాన్ని శుద్ధి చేసి,ఆ చమురుతో తయారయ్యే ఇంధన ఉత్పత్తులను,ముఖ్యంగా జెట్ ఇంధనాన్ని యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్న భారత్, టర్కీ,యూఏఈ వంటి దేశాలపై ఈయూ ఇటీవల విధించిన తాజా ఆంక్షలు ప్రభావం చూపుతాయని అంచనా .

వివరాలు 

జాతీయ ప్రయోజనాలే ముఖ్యమన్న భారత్ 

ఇప్పటికే భారత్ నుంచి యూరప్ దేశాలకు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించిందని సమాచారం. ఇటీవల అమెరికా కూడా రష్యా చమురును దిగుమతి చేసుకునే దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రష్యా చమురును కొనుగోలు చేస్తే ఆర్థిక పరమైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతదేశం, చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు స్పష్టంగా తెలిపింది. అయినప్పటికీ, భారతదేశం మాత్రం తన ఇంధన అవసరాలను తీర్చడంలో రష్యా చమురుపై ఆధారపడటం కొనసాగిస్తుందనేది స్పష్టమైంది. జాతీయ ప్రయోజనాలే తనకు ప్రథమ ప్రాధాన్యత అని భారత్ మరోసారి స్పష్టం చేసింది.