
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసే తీపీ కబురు కేంద్రం నుంచి అందింది.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ, కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేసింది. దీంతో అనుమతుల మంజూరు లాంఛనం కానుంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా పోరాడుతోంది.
ఈఏసీ సభ్యులు సందేహాలను లేవనెత్తుతుండటంతో చాలాసార్లు అనుమతులను వాయిదా వేశారు. ఒకానొకద దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టారు.
Details
సాగునీటి పనులు చేపట్టేందుకు మార్గం సుగుమం
అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈఏసీ కోరిన విధంగా డేటాను సమర్పించింది.
దీంతో ఈ ఏడాది జూన్ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలో ఆ అంశంపై చర్చ కొనసాగింది. అయినా ఈఏసీ సభ్యులు మళ్లీ పూర్తి వివరాలను ఇవ్వాలని కోరారు.
గత నెల 24న నిర్వహించిన 49 ఈఏసీలో మరోసారి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వాదనలను సమగ్రంగా వినిపించారు.
చాలా అంశాలను పరిశీలించిన తర్వాత ఈఏసీ ప్రాజెక్టు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.
రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండో దశ పనులు శరవేగంగా ముందుకు సాగుతాయని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.