Page Loader
బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్ 
బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్

బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
May 29, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సోమవారం చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఈటెల రాజేందర్‌ చాలా వరకు ప్రయత్నించారు. పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై ఆసక్తిగా లేరనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ, పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమేనని అన్నారు. సోమవారం జరిగిన చిట్ చాట్‌లో ఈ మేరకు ఈటల వ్యాఖ్యానించారు.

బీజేపీ

ఖమ్మం జిల్లాలో బలంగా కాంగ్రెస్: ఈటల 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరడానికి ఎందుకు ఆలోచిస్తున్నరనే విషయాన్ని కూడా ఈటల ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని, కమ్యూనిస్టు ఐడియాలజీ ఎక్కువని అందుకే పొంగులేటి చేరకపోవచ్చని చెప్పారు. టీడీపీకి కూడా ఖమ్మం జిల్లాలో ఉనికి ఉందని చెప్పారు. అయితే పొంగులేటి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.