
బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళకరంగా మారింది. ఈ మేరకు కర్ణాటకలో ఘోరం జరిగింది.
సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సాకుగా పెట్టుకుని ఓ ప్రభుద్ధుడు తన మాజీ ప్రియురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
అక్కడితో ఆగకుండా ఆయా వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె వద్దకు తన స్నేహితులను పంపి డబ్బులు దండుకుంటున్న దారుణ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యారణ్యపురకు చెందిన 28 ఏళ్ల జార్జ్ వృత్తి రీత్యా ఓ స్కూల్లో డాన్స్ మాస్టర్.
ఫేస్ బుక్ ద్వారా ఇతనికి ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ తరచూ కలిసుకునేవారు. ఈ క్రమంలోనే జార్జ్ ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు అతన్ని దూరం పెట్టింది.
DETAILS
వేధింపులు భరించలేని యువతి ఏం చేసిందంటే?
దీంతో తట్టుకోలేని జార్జ్, అప్పటివరకు తాము కలిసున్న వీడియోలు, ఫోటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు.
తనతో గడిపినట్టే తన స్నేహితులు సంతోష్, శశికుమార్ వద్ద సన్నిహితంగా ఉండాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.
గత్యంతరం లేని దుస్థితిలో ఉన్న ఆమె వద్దకు స్నేహితులను పంపించాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురి ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు వారిని కలవడం మానేసింది.
ఈ నేపథ్యంలోనే వీడియోలు, ఫొటోలను జార్జ్ తన స్నేహితులకు పంపించాడు. జార్జ్ వేధింపులను ఇంక ఎంతమాత్రం భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
దీంతో జార్జ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ల్యాప్ టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు.