Rathod ramesh: మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూత..ఉట్నూరుకు భౌతికకాయం తరలింపు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతికకాయం ఇచ్చోడ నుంచి అంబులెన్స్‌లో ఉట్నూరుకు తరలించారు. రాథోడ్ రమేష్ 2019 లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆతర్వాత బీజేపీ లో చేరి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. 2009 లో టిడిపి తరపున ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. రాథోడ్ రమేష్ తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.
అస్వస్థత కారణంగా శుక్రవారం రాత్రి హాస్పిటల్ కి తరలింపు
శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రమేష్ రాథోడ్ ను హాస్పిటల్ కు తరలించారు . మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా రమేష్ రాథోడ్ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన పార్థివదేహాన్ని ఉట్నూరుకు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్, ఎంపీగా రమేష్ రాథోడ్ పనిచేశారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన రమేష్ రాథోడ్ 1999 లో టీడీపీ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.