భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు
భారతదేశం"తన సార్వభౌమత్వం,దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి మంచి పనిచేసిందని,అదే సమయంలో శాంతి శాంతిస్థాపన ఆవశ్యకతను ప్రస్తావించింది"అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. నేటి నుంచి దిల్లీ వేదికగా జరగనున్న మెగా G20 సమావేశానికి ముందు ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోపై విధంగా ఆయన స్పందించారు. జీ20 సదస్సుకి భారతదేశం అధ్యక్షత వహిస్తుండడంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు మన్మోహన్. తన జీవితకాలంలో భారత్‌కు జీ20 అధ్యక్షత బాధ్యతలు వచ్చినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. భారతదేశం G20 ప్రెసిడెన్సీపై ఆంగ్ల పత్రికతో డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, దేశీయ రాజకీయాలలో విదేశాంగ విధానం చాలా ముఖ్యమైనదిగా మారిందని అన్నారు. అయితే ఇది ప్రస్తుతం పార్టీల స్వప్రయోజనాలకు ముఖ్యమైన అంశంగా మారింది' అని అన్నారు.
విధాన సమన్వయంపై దృష్టి సారించడం G20కి చాలా ముఖ్యం
తను ప్రధానిగా ఉన్న సమయంలో పార్టీ రాజకీయాల కంటే ఫారెన్ పాలసీ కే అధిక ప్రాధాన్యం ఉండేదన్నారు. దౌత్యాన్ని పార్టీ రాజకీయాలకు ఉపయోగించే విషయంలో సంయమనం పాటించాలని అన్ని పార్టీలకు సూచించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు,ఏదో ఒక దేశానికి మద్దతు ఇవ్వడంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుందన్నారు. శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూనే మన సార్వభౌమాధికారం,ఆర్థిక ప్రయోజనాలకు మొదటి స్థానం ఇవ్వడంలో భారతదేశం సరైన పని చేసిందని తానూ నమ్ముతున్నానని అన్నారు. భద్రత-సంబంధిత వైరుధ్యాలను పరిష్కరించే వేదికగా జీ20ని ఎన్నడూ పరిగణించలేదు. వాతావరణం,అసమానత,ప్రపంచ వాణిజ్యంలో విశ్వాసం వంటి సవాళ్లను పరిష్కరించడానికి భద్రతాపరమైన తేడాలను పక్కనపెట్టి, విధాన సమన్వయంపై దృష్టి సారించడం G20కి చాలా ముఖ్యం,"అని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికిఇష్టపడను: మన్మోహన్
చైనా సంబంధాలు,అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశానికి రాకపోవడంపై భారతదేశ ప్రాదేశిక, సార్వభౌమ సమగ్రతను కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని, అయితే ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి ఇష్టపడనని అన్నారు. భారతదేశ వైజ్ఞానిక స్థాపన ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని మరోసారి నిరూపించుకోవడం గర్వించదగ్గ విషయం. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో,సంస్థలను రూపొందించడంలో గత ఏడు దశాబ్దాలుగా మా ప్రయత్నాలు అపారమైన లాభాలను అందించడమే కాకుండా మనందరినీ గర్వించేలా చేశాయి.
ఇస్రోలో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన మాజీ ప్రధాని
2008లో ప్రారంభించబడిన చంద్రయాన్ మిషన్ చంద్రుని దక్షిణ ధృవాన్ని మొదటిసారిగా చేరుకోవడం ద్వారా సరి కొత్త శిఖరాలకు చేరుకున్నందుకు నేను నిజంగా థ్రిల్ అయ్యాను. ఇస్రోలోని శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు" అని ఆయన అన్నారు. 2004 , 2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ రెండు దఫాలకు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, శనివారం జరిగిన జి 20 విందుకు ఆహ్వానించబడిన నాయకులలో ఉన్నారు.