
Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
ఈ రెండు రాష్ట్రాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ స్థానాలు, కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడనున్నాయి.
మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తుండగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది.
అధికార మహాయుతి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటముల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.
Details
ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం
ఝార్ఖండ్‌లోని 81 శాసనసభ స్థానాలకు రెండు విడతల్లో, నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరిగాయి.
సర్వేలు ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పాయి.
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఎన్డీయే, యూపీఏ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.