PM Modi on UCC: యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని మోదీ ఏం చెప్పారు..?
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ యూనిఫాం సివిల్ కోడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్‌ను "కమ్యూనల్"గా అభివర్ణించిన ఆయన లౌకిక ప్రత్యామ్నాయాన్ని సమర్ధించాడు.
యూనిఫాం సివిల్ కోడ్‌పై పీఏ మోదీ ఏం చెప్పారు?
ప్రధాని మోదీ మాట్లాడుతూ, "మన దేశంలో, సుప్రీంకోర్టు యూనిఫాం సివిల్ కోడ్‌పై చాలాసార్లు చర్చించింది. కోర్టు చాలాసార్లు ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని పెద్ద వర్గం సివిల్ కోడ్ మతపరమైనదని నమ్ముతుంది. నిజం మనం జీవిస్తున్న సివిల్ కోడ్ వివక్షతతో కూడిన సివిల్ కోడ్, దాని స్ఫూర్తితో మనం రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం" అని అన్నారు. 75 సంవత్సరాలుగా ప్రజలు ఈ మతపరమైన సివిల్ కోడ్‌ను సహిస్తున్నారని, మతపరమైన వివక్షను అంతం చేయడానికి లౌకిక పౌర చట్టాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. "దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెబుతాను...అప్పుడే మనం మతం ఆధారంగా వివక్ష లేకుండా ఉంటాం" అని ప్రధాని అన్నారు.