Hyderabad : కన్న కూతురిపై తండ్రి ఆత్యాచారం.. ఆ నరకం నుండి బయటికి రాగానే మరింత ప్రమాదంలోకి!
ఈ వార్తాకథనం ఏంటి
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
చివరికి ఈ విషయాన్ని తల్లికి చెప్పినా పట్టించుకోలేదు. ఇక తండ్రి నుంచి తప్పించుకొని బయటకు రాగా, అక్కడ మరో యువకుడు కామవాంఛ తీర్చుకున్నాడు.
ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad)జీడిమెట్లలో ఆలస్యంగా వెలుగు చూసింది.
బిహార్‌కు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు. అందులో ఓ కుమార్తె(18) ఇంటి వద్దే ఉంటోంది.
ఈ క్రమంలో కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీనిపై తన తల్లికి చెప్పగా అమె పట్టించుకోలేదు.
ఇక అమ్మాయికి గతేడాది దీపావళి సమయంలో బిహార్ కి చెందిన సంతోష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
Details
అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు
సంతోష్ కోసం సికింద్రాబాద్‌కు వచ్చి రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకొని సంతోష్‌కు ఫోన్ చేసింది. ఆ తరువాత రవి సాయంతో ప్రేమికుడు సంతోష్ దగ్గరికి వెళ్లింది.
సంతోష్ ఆమెను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పాడు. వెంట వచ్చిన రవిని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో అతడు సరేనంటూ అమీన్‌పూర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు.
రవి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈనెల 29న మద్యం మత్తులో అమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లి ఆమె ఇంటికి ఫోన్ చేసి జరిగిన విషయంతా చెప్పింది.
దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవితో పాటు ఆ యువతి తండ్రిపై కూడా పోలీసులు ఆత్యాచారం కేసు నమోదు చేశారు.