Page Loader
పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు 
కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు

పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 13, 2023
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో ఓ యువతి, యువకుడు 7 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య భేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ జంట విడిపోయింది. కాస్త విరామం తీసుకున్న యువకుడు ప్రేమ గాయాలను మర్చిపోయి పెద్దల ప్రోత్సాహంతో వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ ప్రియురాలు, ఆమె మాజీ ప్రియుడైన పార్తిబన్‌ను కిడ్నాప్‌ చేసింది. అనంతరం బలవంతంగా ఓ గుడికి తరలించింది. తీవ్ర ఒత్తిడి మధ్య తాళి కట్టించుకుంది. ఇంతలో తన భర్త కనిపించకుండాపోయాడని బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల జాడను కనిపెట్టారు. ఈ క్రమంలోనే బాధిత యువకుడిని విడిపించిన పోలీసులు, నిందితురాలి కుటుంబాన్ని అరెస్ట్ చేశారు.

details

ప్రియుడి కిడ్నాప్ కోసం యువతి కుటుంబ సభ్యులు ప్లాన్ 

చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పార్తిబన్‌, వెల్లూరులోని రాణిపేట యువతి సౌందర్య మనసులు కలవడంతో దీర్ఘకాలం ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి విడిపోయారు. పార్తిబన్‌‌కి పెళ్లైందన్న విషయం తెలిసి, తాను అతన్నే పెళ్లిచేసుకుంటానని, తనను మర్చిపోలేకపోతున్నట్లు కుటుంబీకులకు చెప్పింది. పార్తిబన్‌తోనే తన పెళ్లి జరిపించాలని తల్లి ఉమను పట్టుబట్టింది. సౌందర్య కోసం పార్తిబన్‌ కిడ్నాప్‌కు ఆమె కుటుంబం స్కెచ్‌ వేసింది. శుక్రవారం ఉదయం పార్తిబన్‌ను అతని నివాసం నుంచి అపహరించి నేరుగా కాంచీపురంలోని గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టించారు. పార్తిబన్ భార్య ఫిర్యాదు మేరకు నిందితుల గుట్టు రట్టైంది.ఈ మేరకు సౌందర్యతో పాటు ఆమె తల్లి ఉమ, బంధువులు రమేశ్‌, శివకుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.