LOADING...
India- Fiji: 'కొందరు మీ వైఖరితో సంతోషంగా లేరు': మోదీకి మద్దతుగా ఫిజీ ప్రధాని రబుక కీలక వ్యాఖ్యలు
మోదీకి మద్దతుగా ఫిజీ ప్రధాని రబుక కీలక వ్యాఖ్యలు

India- Fiji: 'కొందరు మీ వైఖరితో సంతోషంగా లేరు': మోదీకి మద్దతుగా ఫిజీ ప్రధాని రబుక కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో, భారత్‌తో ఫిజీ ప్రధాని సితివేణి లిగమామద్ రబుక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఎదుర్కోగలరని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి రబుక మూడు రోజుల పర్యటనలో భారత్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, దేశ రాజధాని దిల్లీలో ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

వివరాలు 

పెద్ద దేశాల మధ్య ఘర్షణలు ఉంటే, దాని ప్రభావం చిన్న దేశాలపై పడుతుంది: రబుక

''టారిఫ్‌ల అంశంపై వచ్చిన వార్తలను చూసిన తరువాత, నేను పీఎం మోదీకి ఒక మాట చెప్పాను. కొందరు దీన్ని స్వాగతించకపోవచ్చు, కానీ మీరు ఏ విధమైన అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కోవచ్చు. పెద్ద దేశాల మధ్య ఘర్షణలు ఉంటే, దాని ప్రభావం చిన్న దేశాలపై పడుతుంది. ఇంట్లో చిన్నవాడు ఆ వ్యవహారాలతో సౌకర్యంగా ఉండలేడు. కేవలం కూర్చొని చూడటం మాత్రమే చేయగలడు'' అని రబుక చెప్పారు. ఈ సందర్భంగా, అమెరికా భారత్‌పై రష్యా ముడి చమురు కొనుగోలుకు ఒత్తిడి సృష్టించడానికి విధించిన అదనపు సుంకాలు ఈరోజు నుండి అమల్లోకి వచ్చిన విషయం కూడా గుర్తు చేశారు.

వివరాలు 

క్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా చేరేందుకు భారత్‌కు మద్దతు 

మూడు రోజుల పర్యటనలో భాగంగా రబుక ఆదివారం దిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్‌ను సందర్శించిన తొలి ఫిజీ ప్రధాని ఈయనే. పర్యటనలో భాగంగా, రబుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరుదేశాలు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతికి సంయుక్తంగా కృషి చేయాలని ప్రతినబూనాయి. పర్యటనలో వైద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యాపారం వంటి ఏడు రంగాల్లో ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ముఖ్యంగా, రక్షణ,భద్రత రంగాల్లో పరస్పర సహకారం బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని మోదీ తెలిపారు. అదనంగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా భారత్ చేరడానికి ఫిజీ తన మద్దతును ప్రకటించిందని రబుక తెలిపారు.