Page Loader
jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?
ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?

jhansi hospital : ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. అగ్గిపుల్ల కారణమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కళాశాలలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అన్న విషయం బయటికి రాగా, తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఓ నర్సు అగ్గిపుల్ల వెలిగించడమే దీనికి కారణమని ఒకరు చెప్పారు. యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు ఆక్సిజన్‌ సిలిండర్‌ పైప్‌ను కనెక్ట్‌ చేస్తున్నప్పుడు, పక్కనే మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించడంతో మంటలు చెలరేగాయని చెప్పారు. ఆక్సిజన్‌ అధికంగా ఉన్న ప్రదేశం కావడం వల్ల క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే భగవాన్ దాస్ నలుగురు పిల్లలను తన మెడకు బట్టతో చుట్టుకుని బయటకు పరిగెత్తాడు.

Details

ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు

ఇతరుల సాయంతో మరికొంతమంది చిన్నారులను కాపాడామని ఆయన వివరించాడు. దట్టమైన పొగలు ఆస్పత్రి భవనాన్ని కమ్మేయడంతో అక్కడ ఉన్నవారు పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. అయితే సేఫ్టీ అలారాలు పనిచేయకపోవడం, వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉండటం వల్ల చిన్నారులను రక్షించలేకపోయామని బాధితుడు ఒకరు చెప్పారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషాద ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు నష్టపరిహాన్ని అందిస్తామన్నారు.