LOADING...
Firing At Durga Puja Pandal: బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు
బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు

Firing At Durga Puja Pandal: బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుర్గా పూజా వేడుకల సందర్భంగా బిహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున అర్హా పట్టణంలోని దుర్గా పూజా మండపం వద్ద గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. సుమారు తెల్లవారుజామున, గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులపై పూజా మండపం వద్దకు చేరుకున్నారు. ఎటువంటి వాదన లేకుండా అక్కడ ఉన్నవారిపై గన్స్‌తో కాల్పులు జరిపారు. ఈ దాడి కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాల్పుల్లో గాయపడిన వారిలో 19 ఏళ్ల అర్మాన్ అన్సారీ, 26 ఏళ్ల సునీల్ కుమార్ యాదవ్, 25 ఏళ్ల రోషన్ కుమార్, సిపాహి కుమార్‌లు ఉన్నారు.

Details

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

అర్మాన్ అన్సారీ వీపుపై, సునీల్ ఎడమ చేయిపై, రోషన్ కుడి మోకాలి కింద, సిపాహి నడుముపై కాల్పులు జరిగాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో రెండు బుల్లెట్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులు ఎవరు? ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.