Page Loader
పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి 
పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి

పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Apr 12, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది. భటిండా ఆర్మీ స్టేషన్ లోపల ఉదయం 4.35 గంటలకు కాల్పులు జరిగినట్లు వెల్లడించింది. వెంటనే స్పందించిన స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్‌లు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం కాల్పులపై అర్మీ అధికారులు విచారమ జరుపుతున్నట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం వెల్లడించింది. అయితే ఆర్మీ మిలిటరీ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు పోలీసులకు ఇంగా అనుమతి ఇవ్వలేదని భటిండా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ జీఎస్ ఖురానా తెలిపారు. అయితే ఇది ఉగ్రవాదులు జరిపిన దాడిగా కనిపించడం లేదని, అంతర్గత గొడవ కావొచ్చని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పంజాబ్ ఆర్మీ స్టేషన్ వెలుపల దృశ్యాలు