
Amarnath Yatra 2025: 'బాబా బర్ఫానీ' మొదటి చిత్రం,వీడియో వైరల్.. 7 అడుగుల ఎత్తులో కనువిందు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరగుతున్నాయి.
సాధారణంగా అమర్‌నాథ్ అనే పేరు వినగానే,సహజంగా మంచుతో స్వయంగా ఏర్పడే శివలింగమే అందరికీ గుర్తుకు వస్తుంది.
యాత్ర సమయం సమీపిస్తున్న తరుణంలో,మంచుతో ఏర్పడిన పవిత్ర శివలింగం భక్తుల దర్శనార్థం సిద్ధమవుతోంది.
దీనితో పాటు,బాబా బర్ఫానీగా పిలవబడే శివలింగానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఈ శివలింగం సుమారు 7 అడుగుల ఎత్తులో ఉందని చెబుతున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భక్తులు ఈ దృశ్యం చూసి కొత్త ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు.
హిందూమతంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో అమర్‌నాథ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.
ఏటా లక్షలాది మంది శివభక్తులు ఈ యాత్రలో పాల్గొనడం ఆనవాయితీగా మారింది.
వివరాలు
పేర్లను నమోదు చేసుకున్న3.6 లక్షల మంది యాత్రికులు
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో ఉన్నఅమర్‌నాథ్ గుహను శివుని నివాసంగా భక్తులు గాఢ విశ్వాసంతో భావిస్తారు.
ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర జూలై 3వ తేదీ నుండి ప్రారంభమై,ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది.
అధికారుల ప్రకారం,ఈ యాత్ర రక్షా బంధన్ పర్వదినంతో ముగియనుంది.
మొత్తం 38రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. మార్గాల్లో మంచు తొలగించేందుకు అధికారులు కృషిచేస్తుండగా,ముఖ్యమైన రెండు మార్గాలైన బాల్టాల్, చందన్‌వారి మార్గాల్లో ఇప్పటికే మంచు తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం,ఇప్పటి వరకు దాదాపు 3.6 లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
యాత్ర ప్రారంభ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పవిత్ర అమర్‌నాథ్ గుహలో 'మంచు శివలింగం'
Amarnath Yatra 2025: First picture of Baba Barfani 🙏🙏
— Anup Gupta (@anoopphr) May 5, 2025
According to the Amarnath Shrine Board, the Yatra will take place from July 3 to August 9 this year. pic.twitter.com/GbJxjeCjk9