LOADING...
Yamuna River: పెరుగుతున్నయమునా నీటిమట్టం.. ఢిల్లీ ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీరు
పెరుగుతున్నయమునా నీటిమట్టం.. ఢిల్లీ ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీరు

Yamuna River: పెరుగుతున్నయమునా నీటిమట్టం.. ఢిల్లీ ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీరు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది. ఢిల్లీలో పరిస్థితి చాలా ప్రమాదకర స్థాయికి చేరింది. యమునా బజార్ ప్రాంతాన్ని వరద నీరు ముంచేసింది. ఇండ్లు,కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు రిలీఫ్‌ క్యాంపులకు వెళ్తున్నారు. హర్యానాలోని హత్నికుంద్ బారేజీ నుండి భారీగా నీటిని విడుదల చేయడం వలన యమునా నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి నీటిమట్టం 205.68 మీటర్ల వద్ద ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు 206.50 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీని కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జలమునిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేశారు.

వివరాలు 

ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో, లోహా పుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 5 వరకు ప్రజల,వాహనాల రాకపోకలను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ షాహ్దారా ప్రకటించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఢిల్లీలో ఆకాశం మేఘావృతంగా ఉండి, సాధారణ వర్షం కొనసాగుతుందని వెల్లడించింది. ఇక, భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్‌లో కూడా నీరు మునిగిపోయింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోగా, సాధారణ జీవన వ్యస్థ స్తంభించిపోయింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) సూచించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. దీంతో గురుగ్రామ్‌లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెరుగుతున్నయమునా నీటిమట్టం