
Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే: ఫరూఖ్ అబ్దుల్లా
ఈ వార్తాకథనం ఏంటి
పూంచ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాక్ మధ్య చర్చలు జరగకుంటే గాజా, పాలస్తీనాలకు పట్టిన గతి కశ్మీర్‌కు తప్పదని అన్నారు.
చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాలేదన్నారు.
గతంలో కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోతే.. ఇజ్రాయెల్ బాంబులతో అల్లాడుతున్న గాజా, పాలస్తీనాల గతినే కశ్మీర్ ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.
ఏదైనా జరగవచ్చని, భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అల్లాకు మాత్రమే తెలుసన్నారు.
ఫరూక్
భారత్ ఎందుకు స్పందిచదు: ఫరూక్ అబ్దుల్లా
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు.
'స్నేహితులను మార్చవచ్చు కానీ, పొరుగువారిని మార్చలేము. మన పొరుగువారితో స్నేహంగా ఉంటే, ఇద్దరూ పురోగమిస్తారు. వారితో శత్రుత్వంతో ఉంటే, మనం త్వరగా అభివృద్ధి చెందలేము' అని వాజ్‌పేయి చెప్పిన మాటలను అబ్దుల్లా గుర్తు చేశారు.
నేటి యుగంలో యుద్ధానికి ఆస్కారం లేదని స్వయంగా మోదీనే చెప్పారన్నారు.
ఇప్పుడు ఆ మాట మీద మోదీ ఎందుకు నిలబడలేకపోతున్నారన్నారు.
ఇప్పుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు ప్రధాని కాబోతున్నారని, అతను భారత్‌లో చర్చలు జరపాలని అనుకుంటున్నారని, మరి భారత్ ఎందుకు ఈ విషయంపై మాట్లాడుతలేదని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు.