LOADING...
Hyderabad: కిచెన్‌లో ఎలుకలు, బొద్దింక‌లు.. హైదరాబాద్‌ పిస్తా హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. వీడియో ఇదిగో!
కిచెన్‌లో ఎలుకలు, బొద్దింక‌లు.. హైదరాబాద్‌ పిస్తా హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. వీడియో ఇదిగో!

Hyderabad: కిచెన్‌లో ఎలుకలు, బొద్దింక‌లు.. హైదరాబాద్‌ పిస్తా హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. వీడియో ఇదిగో!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలో హలీం, బిర్యానీ అని చెప్పగానే ముందుగానే గుర్తుకు వచ్చే పిస్తా హౌస్ రెస్టారెంట్. ఇది కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా విదేశాలకు కూడా తమ హలీం సరఫరా చేస్తున్న ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అండ్ టాస్క్ ఫోర్స్ బృందాలు పిస్తా హౌస్‌ రెస్టారెంట్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని మొత్తం 25 పిస్తా హౌస్ బ్రాంచీలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, వీటిలో 23 రెస్టారెంట్లలో సమగ్ర తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల సందర్భంగా తగిన ఫుడ్ సాంపిల్స్ కూడా సేకరించినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

నాన్‌వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ 

పిస్తా హౌస్‌లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా ఉల్లంఘిస్తున్నారని అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఈ రెస్టారెంట్ల కిచెన్ పరిసరాలు బాగా అపరిశుభ్రంగా ఉండటం, కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నాయని మండిపడ్డారు. అదేవిధంగా, నాన్‌వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఇంకా, తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లలో నాన్‌వెజ్ పదార్ధాలు నిల్వ చేస్తున్న విషయాన్ని గమనించారు. అలాగే, తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

వివరాలు 

ఆరోగ్య భద్రత కోసం ఎటువంటి సడలింపు లేకుండా ఫుడ్ సేఫ్టీ నియమాలు అమలు

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. చాలా సార్లు తనిఖీలు చేసినప్పటికీ, పిస్తా హౌస్ నిర్వాహకులు తమ కార్యకలాపాలను మార్చుకునే విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, నగరంలోని ఏ రకమైన రెస్టారెంట్ అయినా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని అధికారులు హెచ్చరించారు. ఇకపై ఈ రెస్టారెంట్లపై ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు జరగవచ్చని, ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎటువంటి సడలింపు లేకుండా ఫుడ్ సేఫ్టీ నియమాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పిస్తా హౌస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు