LOADING...
Vittal Reddy: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ ఎమ్మెల్యే 
బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ ఎమ్మెల్యే

Vittal Reddy: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ ఎమ్మెల్యే 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2014 కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన విఠల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి, విఠ‌ల్ రెడ్డి ఇద్దరూ క‌లిసి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం నేప‌థ్యంలో ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న‌లు నిర్వహించారు. దీంతో ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి కంటే ముందు విఠ‌ల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ముథోల్ ఎమ్మెల్యే