LOADING...
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 13, 2023
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కీలక నేత మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దయాకర్ రెడ్డి మరణంపై తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీల అధినేతలు సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సీఎం కేసీఆర్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. దయాకర్‌రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు, మక్తల్‌ నుంచి మరోసారి ప్రాతినిథ్యం వహించారు. తెలుగుదేశం పార్టీలోనూ కొత్తకోట కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

DETAILS

దయాకర్ మరణం తెలంగాణ ప్రజలకు లోటు : రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామానికి చెందిన దయాకర్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే కీలక తెదేపా నేతగా గుర్తింపు పొందారు. దయాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. మరోవైపు తెలంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కొత్తకోట మరణం పట్ల సంతాపం తెలియజేశారు. ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మంచి ప్రజా నాయకుడి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటుగా రేవంత్ అభివర్ణించారు.

Advertisement