Page Loader
పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత 
పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత

పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Apr 25, 2023
11:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ఎస్. ప్రకాష్ సింగ్ బాదల్ (95) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పీఏ ధృవీకరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నందున బాదల్‌ను ఏప్రిల్ 21న మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని ఐసీయూలో చేర్చారు. పరిస్థితి విషమించి మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా పలుమార్లు పనిచేశారు. 1970-1971, 1977-1980, 1997-2002, 2007-2017 మధ్య సీఎంగా ఉన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కావడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రకాష్ సింగ్ బాదల్ మరణాన్ని దృవీకరించిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్