
Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకాశం జిల్లా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.
ఆయన సోదరుడు, మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.
చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.
పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో బాధను మిగిల్చిందని ఎంపీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తనకు తల్లితో సమానమైన పార్వతమ్మ చనిపోవడం తీరని లోటని చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి హఠాత్తుగా మరణించడంతో, పార్వతమ్మ ఆరోగ్యం క్షీణించింది.
Details
మాగుంట కుటుంబంలో వరుస మరణాలు
పార్వతమ్మ అంత్యక్రియలు గురువారం నెల్లూరులో నిర్వహించనున్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాజకీయంగా ప్రముఖంగా నిలిచిన పేరు.
1991లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాగుంట సుబ్బరామిరెడ్డి తొలిసారి ఒంగోలు ఎంపీగా విజయం సాధించగా, ఆయన మరణం తర్వాత భార్య పార్వతమ్మ 1996లో ఎంపీగా గెలిచారు.
మాగుంట శ్రీనివాసులురెడ్డి 1998లో రాజకీయాల్లోకి ప్రవేశించి, ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు.
2004లో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు ఎంపీగా, మాగుంట పార్వతమ్మ కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మాగుంట కుటుంబంలోని ఈ వరుస మరణాలు, వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి.